హిమాచల్‌ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్‌ శుక్లా ప్రమాణంస్వీకారం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 18 February 2023

హిమాచల్‌ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్‌ శుక్లా ప్రమాణంస్వీకారం


హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా శివ్‌ ప్రతాప్‌ శుక్లా ఈరోజు సంస్కృత భాషలో ప్రమాణం ప్రమాణంస్వీకారం చేశారు. శివ ప్రతాప్ శుక్లాతో హిమాచల్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సబీనా ప్రమాణం చేయించారు. హిమాచల్‌ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి, పలువురు కేబినెట్ మంత్రులు, కాంగ్రెస్ ఇంఛార్జ్ రాజీవ్ శుక్లా, ప్రతిపక్ష నాయకుడు జైరామ్ ఠాకూర్, హిమాచల్ హైకోర్టు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ శివ్‌ ప్రతాస్‌ శుక్లా మాట్లాడుతూ తనకు సాదాసీదా జీవితాన్ని గడపడమంటే ఇష్టమన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎక్కువ భాగం రోడ్డు మార్గంలోనే తన ప్రయాణం సాగుతుందని, ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేందుకు ప్రయత్నిస్తానన్నారు. దేవభూమిలో తాను నేర్చుకోవాల్సింది చాలా ఉన్నదని చెప్పారు. తనను హిమాచల్‌ గవర్నర్‌గా నియమించింనందుకు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుతునన్నారు. 

No comments:

Post a Comment