విప్లవ భావ జాలం కలిగిన ఖైదీలను తోటి ఖైదీలకు దూరంగా ఉంచండి !

Telugu Lo Computer
0


జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విషయంలో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. ముఖ్యంగా రాడికల్ మనస్తత్వం కలిగిన ఖైదీల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. తిరుగుబాటు, విప్లవ భావ జాలం కలిగిన ఖైదీలను ఇతర ఖైదీల నుంచి దూరంగా ఉంచాలని ఆదేశించింది. తమ సిద్ధాంతాలతో ఇతరుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్న అలాంటి ఖైదీలను, ఇతరుల నుంచి దూరంగా ఉంచాలని సూచించింది. ఇతర ఖైదీల్ని తప్పుదోవపట్టించగలిగే, ప్రభావితం చేయించగలిగే ఖైదీలను గుర్తించి అప్రమత్తం కావాలని ఆదేశించింది. ఖైదీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోడల్ ప్రిజన్ మ్యానువల్ 2016, ను ఇంకా కొన్ని రాష్ట్రాలు అమలు చేయడం లేదని, త్వరగా దీన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేంద్రం లేఖలో పేర్కొంది. అలాగే జైళ్లలో రాడికల్ మనస్తత్వం కలిగిన ఖైదీలకు యాంటీ రాడికల్ లేదా డీ రాడికలైజేషన్ సెషన్స్ నిర్వహించాలని సూచించింది. తప్పుదోవ పట్టిన క్రిమినల్స్‌ను సన్మార్గంలో నడిపించేలా వాళ్లలో మార్పులు తీసుకురావాలని సూచించింది. డ్రగ్స్, నార్కోటిక్స్ కేసుల్లో అరెస్టైన ఖైదీలను కూడా వేరుగా ఉంచాలని చెప్పింది. అండర్ ట్రయల్స్ ఖైదీలతోపాటు, ఇతర ఖైదీలను విభజించి, ప్రత్యేకంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం జైళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని త్వరగా భర్తీ చేయాలని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)