ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహిస్తున్నది. బొగ్గు కుంభకోణం కేసులో భాగంగా రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహాసముండ్‌ మాజీ ఎమ్మెల్యే అగ్నిచంద్రకర్‌ నివాసంతోపాటు రాయ్‌పూర్‌లోని ఐఎస్‌పీ అంబలగన్‌, వ్యాపారవేత్త స్వతంత్ర జైన్‌ నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌పోర్టర్‌ విపుల్‌ పటేల్‌, బిలాస్‌పూర్‌లోని ఓ వ్యాపార వేత్త ఇండ్లపై కూడా ఈడీ అధికారుల బృందం దాడులు చేస్తున్నది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్‌ అధికారిని గతేడాది అక్టోబర్‌లో ఈడీ అరెస్టు చేసింది. సీఎం భూపేష్‌ భగేల్‌కు అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్‌ ఆఫీసర్‌ సమీర్‌ విష్ణోయ్‌తోపాటు వ్యాపారవేత్తలు సునీల్‌ అగర్వాల్‌, లక్ష్మీకాంత్‌ తివారిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఐఏఎస్‌ అధికారి సమీర్ నివాసాల్లో ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)