గంగా విలాస్‌ క్రూయిజ్‌ను ప్రారంభించిన ప్రధాని

Telugu Lo Computer
0


ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ ఎంవీ గంగా విలాస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. అదే విధంగా వారణాసిలోని గంగా నది ఒడ్డున 'టెన్త్ సిటీ'ని, కోట్ల నిధులతో అనేక ఇతర అంతర్గత జల మార్గాల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు భారతదేశంలో పర్యాటక రంగానికి కొత్త యుగానికి నాంది పలుకుతుందని చెప్పారు. గంగానందిపై ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీస్ ప్రారంభం కావటం ఒక మైలురాయి అని ప్రధాని మోదీ అన్నారు. గంగా నది మనకు కేవలం నది మాత్రమే కాదని, ప్రాచీన కాలం నుంచి గుర్తులకు సాక్షిగా నిలుస్తోందని తెలిపారు. గంగామాత భారతీయులను ఎల్లవేళలా పెంచి పోషించిందని అన్నారు. అయితే, స్వాతంత్ర్యానంతరం నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు లక్షలాది మంది వలసబాట పట్టారని, ఈ పరిస్థితిని మార్చాల్సిన అ వసరం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ఒకవైపు నమామి గంగ పేరుతో గంగానది పరిశుభ్రతకు కృషి చేశామని మోదీ గుర్తుచేశారు. గంగా విలాస్‌లో ప్రయాణిస్తున్న విదేశీ పర్యాటకులకు మీరు ఊహించగలవన్నీ భారతదేశంలో ఉన్నాయని మోదీ తెలిపారు. ఇదిలాఉంటే ఎంవీ గంగా విలాస్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రివర్ క్రూయిజ్‌గా గంగా విలాస్‌కు పేరుంది. ఇది 51 రోజులు దాదాపు 3,200 కి.మీ పైగా ప్రయాణిస్తుంది. 36 మంది పర్యాటకులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంది. విలాసవంతమైన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. బంగ్లాదేశ్, ఇండియాల్లో 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ క్రూయిజ్ ప్రయాణిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)