చలి కాలం = ఉసిరికాయ !

Telugu Lo Computer
0


చలి కాలంలో ఉసిరికాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలలో ఉసిరికాయ కూడా ఒకటి. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి. చేదు, పులుపు రుచులతో మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే శక్తి ఇందులో ఉంటుంది. కాబట్టి ఉసిరిని తినడం వల్ల బరువు తగ్గుతారు. ఉసిరికాయను చలికాలంలో తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధుల నుండి రక్షిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఉసిరికాయ ఒక వరం అని చెప్పవచ్చు. ఇది మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మధుమేహం ఉన్నవారు దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి.ఉసిరికాయ మన శరీరంలోని కణాల నష్టాన్ని నియంత్రిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వులను కరిగించే శక్తి కూడా ఉసిరికాయలో ఉంది. ఆ విధంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే చలి కాలంలో వచ్చే బాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని శరీరం కోల్పోతుంది. అటువంటి సమయంలో జలుబు, దగ్గు వంటి పై మనపై దాడి చేస్తాయి. ఉసిరికాయను తింటే, మీ రోగనిరోధక వ్యవస్థ బలపడి, మీరు ఈ వ్యాధుల నుండి చాలా వరకు రక్షించబడతారు.

Post a Comment

0Comments

Post a Comment (0)