ఉడకబెట్టిన కోడి గుడ్డు ను వెంటనే తినాలి !

Telugu Lo Computer
0


గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో ఎంతో మంది తమ రోజు వారి ఆహారంలో గుడ్డుని భాగంగా చేసుకుంటున్నారు. చలికాలంలో సాధారణంగా ఇంట్లో ఉన్న ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకొని తినడం ప్రతి ఒక్కరికి అలవాటు. దీంతో వండిన అన్ని పదార్థాలను కూడా పదే పదే వేడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గుడ్లను కూడా ఇలా వేడి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలా చేయడం  మాత్రం ప్రమాదకరమని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుడ్లను ఉడక పెట్టిన వెంటనే తినాలని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని తిరిగి వేడి చేయకూడదని సూచిస్తున్నారు. ఒకవేళ అలా వేడి చేసి తిన్నారు అంటే గుడ్డులో ఎక్కువగా లభించే నైట్రోజన్ క్యాన్సర్ కారక ప్రిరాడికల్స్ ని విడుదల చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)