టోక్యో మహా నగరాన్ని వీడండి !

Telugu Lo Computer
0


టోక్యో మహా నగరం 3.80 కోట్లకు పైగా జనాభాతో ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రోపాలిటన్‌ నగరంగా రికార్డులకెక్కింది. మరో వైపు దేశంలోని మిగిలిన పట్టణాలు జనాభా తగ్గిపోయి సంక్షోభంతో జపాన్‌ కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో టోక్యో నుంచి ఇతర ప్రాంతాలకు వలసలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. టోక్యోను వీడే కుటుంబంలోని ఒక్కో బిడ్డకు గతంలో 3 లక్షల యెన్‌ల చొప్పున ఇవ్వగా ఇప్పుడు దీన్ని 10 లక్షల యెన్‌లకు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇది అమల్లోకి రానుంది. జపాన్‌లోని ఇతర నగరాల్లో జనాభా లేక వ్యాపారాలు దెబ్బతినడంతో ఆస్తుల విలువ పడిపోతోంది. టోక్యోను వీడాలంటూ జపాన్‌ 2019 నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రారంభించింది. జననాల రేటు తగ్గుతున్న, వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాలకు కుటుంబాలు తరలివెళ్లేలా ప్రోత్సహిస్తోంది. ఇదివరకు.. ఒకరికంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబానికి 30 లక్షల యెన్‌ల వరకు ఆర్థిక సాయంతోపాటు, ఒక్కో బిడ్డకు 3 లక్షల యెన్‌ల చొప్పున చెల్లించింది. సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆర్థిక సాయం అందించేది. అయినా వలసల్లో మార్పు కనబడలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)