అడ్మిన్ నాలుక కో సిన వాట్సాప్ గ్రూప్ సభ్యుడు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ఫుణె, ఫుర్సుంగి ప్రాంతంలో స్థానిక హౌసింగ్ సొసైటీ వాళ్లందరికి కలిపి 'ఓం హైట్స్ ఆపరేషన్'అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ అపార్ట్ మెంట్ చైర్ పర్సన్ గ్రూప్ అడ్మిన్ గా ఉన్నాడు. అయితే ఆ గ్రూప్ సభ్యునిగా ఉన్న ఒక వ్యక్తి తరచూ విద్వేషపూరితమైన, వివాదాస్పదమైన పోస్టులు పెడుతున్నాడని అతడిని అడ్మిన్ గ్రూప్ నుంచి తొలగించాడు. ఆ విషయం గురించి అడుగుతూ నిందితుడు అడ్మిన్ కి మెసేజ్ చేయగా, వాటికి అడ్మిన్ స్పందించలేదు. ఆ కోపంతో ఆ వ్యక్తి మరో నలుగురితో కలిసి వెళ్లి అడ్మిన్ ని చితకబాదాడు. ఆ తర్వాత అడ్మిన్ నాలుక కోశాడు. ఈ విషయంపై బాధితుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, నిందితులపై కేసు నమోదైంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)