పనులు లేకపోవడం వల్లే అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో అనేక మంది యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. దీనికి కారణం తమ ఆడపిల్లలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రాక పోవడమే. ఉద్యోగాలు లేని కారణంగా పెళ్లి చేసుకోవాడానికి అమ్మాయిలు దొరడం లేదు. దీనిపై ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ స్పందిస్తూ, ఉద్యోగం లేని వ్యక్తికి పిల్లను ఎవరు ఇస్తారని తెలిపారు. ఒకసారి తాను ఒక ఊరికి వెళ్లానని, అక్కడ 30 యేళ్లలోపు వయస్సున్న కొందరు యువకులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారని, ఎందుకు ఖాళీగా ఉన్నారని తాను ప్రశ్నిస్తే తమ ప్రాంతంలో తాము చేయడానికి పనులు లేవని చెప్పారని తెలిపారు. వారిలో డిగ్రీలు, బీటెక్‌లు చేసిన యువకులు కూడా ఉన్నారని చెప్పారు. పని లేకపోవడంతో అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. చదువుకున్న వాళ్ళు తమకు ఉద్యోగాలు కావాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సూచించారు. మహారాష్ట్రలో నిరుద్యోగు పెరిగిపోతోందన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీని ఇచ్చిన బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మరిచిపోయారని అన్నారు. మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలో ఉన్నపుడు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కృషి చేశామని ఆయన చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)