గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అబ్దెల్‌ !

Telugu Lo Computer
0


భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తాహ్‌ ఎల్‌-సిసి హాజరు కానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈనెల 26న జరిగే 74వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తాహ్‌ ఎల్‌-సిసి హాజరవుతున్నట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈజిప్ట్‌ నుంచి ఓ నేత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకు జనవరి 24న ఈజిస్టు అధ్యక్షుడు ఢిల్లీ చేరుకుంటారు. 25వ తేదీన ప్రధాని మోడీతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అనంతరం ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌తో సమావేశమవుతారు. అదేరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ పూర్వకంగా ఇచ్చే విందుకు ఆయన హాజరవుతారు. 26న గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో అబ్దెల్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ పరేడ్‌లో ఈజిప్ట్‌ నుంచి వచ్చిన 180 మంది సభ్యులతో కూడిన బృందం పాల్గొననుంది. ఈ సందర్భంగా 75 సంవత్సరాల భారత్‌-ఈజిప్టు దౌత్య సంబంధాలకు గుర్తుగా స్మారక స్టాంపును విడుదల చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)