లాస్ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్ లేదు !

Telugu Lo Computer
0


2028లో లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే ఒలింపిక్స్‌లో క్రికెట్ కనిపించదు. ఈ మేరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు సమాచారం అందించింది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత 2032లో ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. 2032 ఒలింపిక్స్ కి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం తిథ్యం ఇవ్వనుంది. ఇప్పటి వరకు క్రికెట్ ఆట ఒలింపిక్ చరిత్రలో ఒక్కసారి మాత్రమే జరిగింది. 1900లో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. అయితే అప్పటి నుంచి క్రికెట్ ఒలింపిక్స్‌లో భాగం కావడంలో విఫలమైంది. 1900 ఒలింపిక్స్‌ పారిస్‌లో జరిగాయి. ఆ ఒలింపిక్స్‌లో గ్రేట్ బ్రిటన్, ఆతిథ్య ఫ్రాన్స్‌ క్రికెట్ టోర్నమెంట్‌లో కేవలం 2 జట్లు మాత్రమే పాల్గొన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)