విమానానికి బాంబు బెదిరింపు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 20 January 2023

విమానానికి బాంబు బెదిరింపు !


రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే మాస్కో పోలీసులకు దుండగులు ఫోన్ చేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఈ విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారిమళ్లించారు. అజూర్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు. రష్యాలోని పెర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి సమయంలో బయల్దేరింది. ఇందులో బాంబు అమర్చినట్లు గోవా దబోలిమ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12:30 గంటలకు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానం భారత గగనతలంలోకి ప్రవేశించకముందే ఉబ్జెకిస్తాన్‌కు మళ్లించారు. 

No comments:

Post a Comment