కృత్రిమ కాంతులు అనారోగ్యానికి హేతువులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 23 January 2023

కృత్రిమ కాంతులు అనారోగ్యానికి హేతువులు !


గతంలో రాత్రుల్లు ఆకాశంలో పాలపుంతలు స్పష్టంగా కనిపించేవి. కానీ ఇప్పుడు మసకగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం  ఆకాశంలో కృత్రిమ వెలుగులు ఎక్కువ శాతం ఆవరించడమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశాన్ని ఆవరించే కృత్రిమ కాంతి 2012 - 2016 మధ్యకాలంలో ఏటా 2 శాతానికి పైగా పెరిగింది. 24 గంటలూ కృత్రిమ కాంతుల్లో జీవించడంతో బల్బు కాంతికి సూర్యకాంతికి తేడా తెలియకుండా పోతోంది. అధిక కాంతి వల్ల రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదు. పగలు ఉదయం పూట ఇళ్లల్లో సహజ కాంతి లేక నిద్ర నుంచి మేల్కోవడం చాలా ఆలస్యమౌతోంది. ఈ వివరీత జీవన శైలి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాదాపు 50 వేల వర్ధమాన ఖగోళ పరిశోధకుల నుంచి సేకరించిన డేటా ప్రకారం ఆకాశంలో ఏటా 10 శాతం వరకు కృత్రిమ వెలుగులు వ్యాపిస్తున్నాయి. ఫలితంగా ఆకాశంలో నక్షత్రాలు, చందమామ నుంచి వచ్చే సహజ వెలుగులను చూడలేని పరిస్థితి వస్తోంది.. ఏటేటా మనం నక్షత్రాల సహజ కాంతిని చూడడం తక్కువైపోతోందని యూనివర్శిటీ ఆఫ్ శాంటియాగో డి కంపోస్టెలాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఫెబియో ఫాట్చీ పేర్కొన్నారు. గ్లోబ్ ఎట్ నైట్ ప్రాజెక్టు ప్రతినిధులు కృత్రిమకాంతుల వల్ల వచ్చే అనర్ధాలపై అధ్యయనం చేపట్టారు. ఈమేరకు సేకరించిన డేటా ప్రకారం వాలంటీర్లు కాలభైరవ నక్షత్ర సమూహాన్ని పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నక్షత్ర రాశిలో అల్నిటక్, అల్నిలం, మింటకా అనే ప్రకాశవంతమైన మూడు నక్షత్రాలుంటాయి. ఉత్తరాదిలో శీతాకాలంలోను, దక్షిణాదిలో వేసవిలోనూ రాత్రి ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. కానీ వీటి చుట్టూ రానురాను అనేక కృత్రిమ వెలుగులే వ్యాపిస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. భూమి నుంచి శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా పరిశీలించగా, ఏటా ఆకాశంలో 2 శాతం వంతున కృత్రిమ వెలుగుల వికాసం పెరుగుతోందని తేలింది. దీనికి పరిశోధకులు ఒక ఉదాహరణ వివరించారు. ఆకాశంలో స్పష్టంగా 250 నక్షత్రాలను చూడగలిగే కాలంలో పుట్టిన బిడ,్డ 18 ఏళ్లు ప్రాయం వచ్చాక చూస్తే కేవలం 100 నక్షత్రాలను మాత్రమే కనిపిస్తాయని పరిశోధకులు ఉదహరించారు. మితిమీరిన కృత్రిమ వెలుగులు మానవ దైనందిన జీవన సరళిని తారుమారు చేస్తుందని జార్జిటౌన్ బయోలజిస్టు ఎమిలీ విలియమ్స్ హెచ్చరించారు. రాత్రి పక్షులు ఆకాశంలో నక్షత్ర కాంతిని బట్టి పయనిస్తుంటాయని, అలాగే తాబేళ్లు నక్షత్రాల కాంతిని గమనించే పిల్లలను పొదిగి సముద్రం వైపు వెళ్తాయని ఆమె ఉదహరించారు. 2015 లో విడుదలైన అంతర్జాతీయ అధ్యయనం ప్రకారం ప్రపంచం లోని పట్టణ జనాభాలో 80 శాతం మంది స్కైగ్లో కాలుష్యం అంటే కృత్రిమ వెలుగుల కాలుష్యంతో ప్రభావితమయ్యారని తేలింది. అమెరికా, ఐరోపా దేశాల్లో 99 శాతం ప్రజలు సహజ కాంతి, కృత్రిమ కాంతి మధ్య తేడాను గుర్తించ లేక పోతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.

No comments:

Post a Comment