ఉద్యోగుల సంఘానికి షోకాజ్ నోటీసు జారీ

Telugu Lo Computer
0


ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గవర్నర్ హరిచందన్ తో భేటీ అయిన ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం ఇవాళ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇందులో పలు అంశాల్ని ప్రస్తావించింది. గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లోగా తెలియజేయాలని సాధారణ పరిపాలన శాఖ నోటీసు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇరుకునపడింది. దీనిపై సరైన వివరణ ఇవ్వడంలో విఫలమైతే నిబంధనల ప్రకారం గుర్తింపు రద్దుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై ఉద్యోగులు గవర్నర్ కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసులో ప్రభుత్వం పేర్కొంది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ఇందులో పేర్కొంది. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ఇతర మార్గాలున్నా గవర్నర్ ను ఎందుకు సంప్రదించాల్సి వచ్చిందని ప్రభుత్వం ఇందులో ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం దీనిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గవర్నర్ కు ఏకంగా ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన వ్యవహారంలో ముఖ్యమంత్రి  సీరియస్ గా ఉన్నారు. అంతే కాదు గవర్నర్ కు ఫిర్యాదు వెనుక రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విపక్షాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం సేకరించిన ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)