సహనం కోల్పోయి కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 24 January 2023

సహనం కోల్పోయి కార్యకర్తలపై రాయి విసిరిన మంత్రి !


తమిళనాడుకు చెందిన మంత్రి సహనం కోల్పోయారు. తనకు కుర్చీ తేవడంలో ఆలస్యమైందని కార్యకర్తలపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా వారిపై రాయి విసిరారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మామూలుగా సభల్లో పాల్గొన్న నేతలపై రాళ్లు విసిరిన, ఇంకు చల్లిన ఘటనలు మనం చూస్తుంటాం. కానీ తమిళనాడుమంత్రి ఎస్‌ఎం నాజర్  విషయంలో అది రివర్స్ అయింది. ఆయనే కార్యకర్తలపై రాయి విసిరారు. తిరువళ్లూరులో బుధవారం జరగనున్న సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆ మంత్రి వచ్చారు. ఆ సభకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా హాజరుకానున్నారు. ఏర్పాట్లు చూస్తున్న ఆయనకు కుర్చీ వేయడంలో ఆలస్యం అయింది. దాంతో ఆగ్రహానికి గురైన ఆయన కార్యకర్తలపై రాయి విసిరారు.

No comments:

Post a Comment