అనంత్‌నాగ్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలపై ఆందోళన

Telugu Lo Computer
0


జమ్ముకాశ్మీర్‌ లోని ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారు వెంటనే ఖాళీ చేయాలన్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాలపై జమ్ముకాశ్మీర్‌ అంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. అనంత్‌నాగ్‌ జిల్లా లార్నూ-కొకెర్నాగ్‌ ప్రాంతంలో గురువారం భారీ ఎత్తున ప్రజలు నిరసన తెలిపారు. ప్రభుత్వ భూములను ఏడు రోజుల్లోగా ఖాళీ చేయాలని, లేకపోతే కఠిన చర్యలను ఎదుర్కోవాలని ఈ నెల 4న జమ్ముకాశ్మీర్‌ గవర్నర్‌ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4న జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా అనేక ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్నా, గురువారం తొలిసారిగా అనంత్‌నాగ్‌ జిల్లాలో భారీ స్థాయిలో ఆందోళన నిర్వహించారు. లార్నూలోని బిధార్డ్‌లో భారీ సంఖ్యలో ఆందోళనకు దిగిన ప్రజలు ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతూ స్థానిక అధికారులకు మెమొరాండం సమ ర్పించారు. 'ప్రభుత్వ ఆదేశాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తు న్నాయి. ఈ నిర్ణయం ప్రజలను ఇళ్లు లేని వారిగానూ, భూమిలేని వారిగానూ చేస్తుంది. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని, వ్యవసాయం చేస్తూ ప్రజలు జీవిస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పిఎంఎవై) కింద ఈ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్నారు' అని స్థానిక ఉద్యమకారుడు చౌదరి హరూన్‌ ఖతన తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వు లు జమ్ముకాశ్మీర్‌లోని ప్రజలందర్నీ ఆందోళనకు గురి చేస్తున్నా యని, పేద ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ప్రభు త్వం పునరాలోచించి, ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)