రూ.5 కోట్లు జాక్ పాట్ కొట్టిన మహంత్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 19 January 2023

రూ.5 కోట్లు జాక్ పాట్ కొట్టిన మహంత్ !


పంజాబ్ లోని మొహాలీ జిల్లా త్రివేది క్యాంప్ అనే గ్రామంలో మహంత్ ద్వారకా దాస్ అనే వృద్ధుడు కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కుమారుడు నరేంద్ర కుమార్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మహంత్ ద్వారకా దాస్ కు ఓ మనుమడు కూడా ఉన్నాడు. ఎన్నో కష్టాలు పడి ద్వారకా దాస్, కుమారుడు నరేంద్ర కుమార్ ను పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు జీవితం చివరి దశలో చాలా ప్రశాంతంగా కడుపుతున్నాడు. అయితే ఆయనకు లాటరీలపై చాలా ఆసక్తి ఉండేది. దీంతో తరచూ లాటరీ టికెట్లు కొనేవాడు. అలా ఎన్ని సార్లు లాటరీలను కొనుగోలు చేసిన కూడా అదృష్టం ఆయన్ను పలకరించలేదు. అలానే కొన్ని రోజుల క్రితం మహంత్ దాస్ మనవడు నిఖిల్ శర్మతో జాకీర్ పూర్ పంచకుల రోడ్డు ప్రాంతంకి వెళ్లారు. అక్కడే ఉన్న లోకేశ్ లాటరీ షాపులో మనవడు టికెట్ కొనిపించాడు. అయితే ఇటీవలే తీసిన లక్కీ డ్రాలో మహంత్ దాస్ లాటరీ టికెట్ నంబర్ వచ్చింది. ఈ విషయాన్ని ఆ లాటరీ షాపు ఓనర్.. బ్యాండు మేళంతో వెళ్లి మరీ మహంత్ దాస్ కు విషయం చెప్పాడు. ఆ వృద్ధుడికి రూ.5 కోట్లు ఈ లాటరీలో గెలుచుకున్నాడు. లాటరీ షాపు ఓనర్ లోకేశ్.. మహంత్ దాస్ కు పూల మాల వేసి.. స్వీట్ తినిపించి మరీ.. ఈ విషయం చెప్పాడు. ఈ వార్తతో దాస్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. త్రివేది క్యాంప్ గ్రామస్తులకు ఈ విషయం తెలియడంతో దాస్ ఇంటికి క్యూ కడుతున్నారు. వృద్ధాప్యంలో అదృష్ట లక్ష్మి పలకరించడంతో అందరూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక గెలుచుకున్న ఈ సొమ్ములో టాక్స్, ఇతర ఖర్చులు పోను మిగిలినది మహంత్ ద్వారక దాస్ కు వస్తుందని షాపు యజమాని తెలిపాడు. తాను ఇన్నేళ్లు కష్టాల కడలి ఈదుతూ ఉంటే.. జీవితం చరమాకంలో అయినా అదృష్ట లక్ష్మి పలకరించడం సంతోషంగా ఉందని మహంత్ ద్వారకా దాస్ తెలిపారు.

No comments:

Post a Comment