అసెంబ్లీలో నుంచి గవర్నర్‌ వాకౌట్‌ !

Telugu Lo Computer
0


తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం విషయమై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య వివాదం చెలరేగింది. దీంతో అసెంబ్లీ నుంచి గవర్నర్‌ వాకౌట్‌ చేశారు. ఈ మేరకు సీఎం స్టాలిన్‌ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన గవర్నర్‌ ఒరిజినల్‌ ప్రసంగాన్ని మాత్రమే రికార్డు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే గవర్నర్‌ ఆ ప్రసంగంలోని లౌకికవాదం, పెరియార్‌, బీఆర్‌ అంబేద్కర్‌, కే కామరాజ్‌, సీఎన్‌ అన్నాదురై, కరుణానిధి వంటి నేతలకు సంబంధించిన వాటిని స్కిప్‌ చేశారు. దీంతో స్టాలిన్‌ గవర్నర్‌ చర్య రాజ్యంగ విరుద్ధమంటూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌పై నిషేధం, క్లిప్పంగ్‌ బిల్లులు క్లియర్‌ చేయడంలో జాప్యం తదితరలన్నింటిని నిరసిస్తూ డీఎంకే మిత్ర పక్షాలు కాంగ్రెస్‌, విడుతలై చిరుతైగల్‌ కట్చి(వీసీకే), సీపీఐ, సీపీఎం ముందుగా గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించాయి. అదీగాక తమిళనాడుకు తమిళగం అనేది మరింత సముచితమైన పేరు అని గవర్నర్‌ చేసిన వ్యాఖ్యను కూడా వారంతా వ్యతిరేకించారు. గవర్నర్‌ రవికి వ్యతిరేకంగా అసెంబ్లీలో క్విట్‌ తమిళనాడు వంటి నినానాదాలు ప్రతి ధ్వనించాయి. అధికార డీఎంకే ఎమ్మెల్యేలు కూడా బీజీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని రుద్దొద్దు అంటూ గట్టిగా నినాదాలు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)