వందేళ్ల రాబందు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అరుదైన పక్షి కనువిందు చేసింది. ఈద్గా శ్మశానవాటికలో కనిపించిన తెల్లటి హిమాలయ రాబందు స్థానికులను ఆకట్టుకుంది. దాదాపు 5 అడుగుల రెక్కలు కలిగిన రాబందు వయసు దాదాపు వందేళ్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ రాబందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హిమాలయ గ్రిఫన్ రాబందు ప్రపంచంలోనే అత్యంత అరుదైన పక్షి. చాలా పెద్దగా ఉండే ఈ హిమాలయ రాబందు, సాధారణంగా హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంటుంది. ఈ రాబందు 1200 నుంచి 5000 మీటర్ల ఎత్తులో, వేల కిలోమీటర్ల దూరం చాలా ప్రయాణిస్తుంది. టిబెట్, కాబూల్, భూటాన్, తుర్కిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో పాటు పశ్చిమ చైనా, మంగోలియా, హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపించే ఈ పక్షి125 సెంటీమీటర్లు ఎత్తు 8 నుంచి 9 అడుగుల పొడవైన రెక్కలను కలిగి ఉంటుంది. గ్రిఫిన్ రాబందు మగ, ఆడ జాతులు ఒకే రకంగా కనిపిస్తాయి. 8 నుంచి 10 కిలోల బరువు కలిగి ఉంటాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)