కోసీ నదిపై అంబానీ సేతు !

Telugu Lo Computer
0


బీహార్‌లోని నాలుగు జిల్లాలతో అనుసంధానంగా ఉంది కిరాత్‌పూర్‌ గ్రామం. అయితే ఆ గ్రామం దాటి బయటకు రావాలంటే కోసీ నది దాటాల్సిందే. దానికి పడవ మార్గం తప్ప మరొకటి లేదు. రాత్రి సమయంలోనైతే.. ఆ సౌకర్యం కూడా ఉండదు. వంతెన కోసం గ్రామస్థులు ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి తప్ప.. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వంపై ఆ గ్రామస్థులు ఆశలు కోల్పోయారు. తిరిగి తిరిగి అలసిపోయినా ఆ గ్రామస్థులు చందాలు వేసుకుని రూ.6 లక్షలు పోగు చేశారు. దర్భంగా బ్లాక్‌లో కోసి నదిపై కిరాత్‌పూర్ పంచాయతీ, సమీప గ్రామస్తులు పరస్పర సహకారంతో సుమారు రూ. 1.5 లక్షలతో నడిచే వంతెనను నిర్మించారు. వారం రోజుల క్రితమే ఈ వంతెన సిద్ధమైంది. వంతెనకు అంబానీ సేతు అని పేరు పెట్టారు. ప్రభుత్వం చూపు దానిపై పడి శాశ్వత వంతెన నిర్మించాలనే ఉద్దేశంతో భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ పేరు పెట్టారు. స్థానిక నివాసి వీర్ యాదవ్ మాట్లాడుతూ కోసి నదిపై నడిచే వంతెనను సంవత్సరాల క్రితం నుండి ప్రతి సంవత్సరం నిర్మిస్తున్నారు. చాలా మంది ప్రజలు ఈ వంతెనపైనే ఆధారపడుతున్నారు. గ్రామంలో ఎలాంటి అత్యవసర వైద్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కిరాత్‌పూర్ బ్లాక్‌లోని కోసి నది తూర్పు భాగాలలో ఉన్న చాలా మంది ప్రజలు ఈ వంతెన గుండానే ఇతర గ్రామాలకు పనుల నిమిత్తం వెళ్తారు. కోసి నదిలో వర్షాకాలంలో నది నీటి మట్టం పెరిగినప్పుడు, నదీ ప్రవాహంతో వంతెన కొట్టుకుపోతుంది. ఆ తర్వాత గ్రామస్తులు మరొక వంతెనను నిర్మిస్తారు. ఇలా వంతెనను నిర్మించడం.. అది కొట్టుకుపోవడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. స్థానిక బిజెపి ఎమ్మెల్యే స్వర్ణ సింగ్ ఎన్నికల అజెండాలో కిరాత్‌పూర్‌లోని కోసి నదిపై వంతెన నిర్మాణాన్ని మొదటిగా పెట్టారని, అయితే ఎన్నికల్లో గెలిచి రెండేళ్లు గడుస్తున్నా ఆ ప్రాంత ప్రజలను ఆ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. కుబోల్ దంగా ప్రధాన ప్రతినిధి బాబన్ యాదవ్ మాట్లాడుతూ దాదాపు 50 సంవత్సరాలుగా, తన పూర్వీకులు కోసి నదిపై పరస్పర శ్రమతో నడిచే వంతెనను నిర్మించారని చెప్పారు. ఇప్పుడు వాటికి అలవాటు పడ్డారు. ప్రభుత్వం తరఫున పలుమార్లు వినతులు అందజేశామని కిరాత్‌పూర్‌ ప్రధాన ప్రతినిధి కైలు సదా చెబుతున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వం పట్టించుకుని శాశ్వత వంతెన నిర్మిస్తే బాగుంటుందని గ్రామస్థులు కోరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)