కథువా నుండి భారత్ జోడో యాత్ర ప్రారంభం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 20 January 2023

కథువా నుండి భారత్ జోడో యాత్ర ప్రారంభం !


భారత్ జోడో యాత్ర చివరి దశకు చేరుకుంది. జనవరి 30న శ్రీనగర్‌లో భారీ ర్యాలీతో రాహుల్ గాంధీ యాత్రను ముగించనున్నారు. జమ్మూ కశ్మీర్‌లోని కథువాలో శుక్రవారం భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో వర్షాలు కుుస్తున్నాయి. చిరుజల్లుల్లోనూ రాహుల్ గాంధీ తన పాదయాత్రను కొనసాగించారు. ఈ క్రమంలో వర్షంకు రక్షణగా రాహుల్ నల్ల రెయిన్ జాకెట్ ధరించి కనిపించారు. యాత్ర ప్రారంభం నుంచి తెల్ల టీషర్ట్‌తోనే కనిపిస్తున్న రాహుల్ తొలిసారి నల్ల జాకెట్ ధరించారు. రాహుల్ గాంధీ కతువాలోని హత్లీ మోడ్ నుంచి జమ్మూలోని చద్వాల్ వరకు సుమారు 23 కిలో మీటర్లు పాదయాత్ర చేయనున్నారు. రాత్రి సమయంలో చద్వాలలో బస చేస్తారు. సెప్టెంబర్ 7న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. 10 రాష్ట్రాల్లో 52కంటే ఎక్కువ జిల్లాల్లో రాహుల్ పాదయాత్రలో పాల్గొన్నారు. యాత్ర సమయంలో ఎక్కడా కూడా రాహుల్ గాంధీ తెల్ల టీషర్ట్ మినహా మరేదీ ధరించలేదు. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాత్ర సాగిన సమయంలోనూ తెల్లవారు జామున 6 గంటలకు తెల్ల షర్ట్ పైనే రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్ తెల్ల టీషర్ట్ పై దేశవ్యాప్తంగా చర్చసైతం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శల దాడిసైతం కొనసాగింది. గడ్డకట్టించే చలిలోనూ రాహుల్ గాంధీ కేవలం తెల్ల టీషర్ట్ పైనే భారత్ జోడో యాత్రలో పాల్గొనడంపై మీడియా ప్రశ్నించింది. రైతు, కార్మికుడు, పేద పిల్లలను ఇలా ఎప్పుడైనా అడిగారా? చలి నుంచి రక్షించే వెచ్చని బట్టలు కొనుగోలు చేయలేని వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా అంటూ రాహుల్ ఎదురు ప్రశ్నించారు. నేను వేల కిలోమీటర్లు నడిచా.. కానీ అది ఏమాత్రం పెద్ద విషయం కాదు.. వాస్తవానికి వ్యవసాయం చేసే రైతులు, కూలీలు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు రోజూ చాలాదూరం నడుస్తారని, కష్టపడతారని రాహుల్ చెప్పారు.

No comments:

Post a Comment