మేం జోక్యం చేసుకోలేం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 20 January 2023

మేం జోక్యం చేసుకోలేం !


ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా వివాదాస్పదమైన జీవో నెంబర్ 1 పై సుప్రీం కీలక ఆదేశాలు ఇచ్చింది. రోడ్ల పైన సభలు - ర్యాలీల నిర్వహణ పైన ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1 పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీం తెలిపింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉండటంతో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు హైకోర్టులో తిరిగి 23న విచారణకు రానుండటంతో ఆ కేసును ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విచారించాలని సుప్రీం కీలక సూచన చేసింది. ఈ జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. జీవో 1 పై ఇటీవల ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్‌ చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ డివై చంద్రచుడ్, పీఎస్ నరసింహతో కూడిన ధర్మాసనం నేడు విచారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం చేపడుతుందని ధర్మాసనం వెల్లడించింది.No comments:

Post a Comment