న్యాయం జరిగే వరకు పోరాటం !

Telugu Lo Computer
0


తమకు న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తామని రెజ్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒలింపిక్స్‌ పతక విజేతలు వినేశ్‌ ఫొగాట్‌, బజరంగ్‌ పునియా, సాక్షి మలిక్‌తోపాటు సంగీత ఫొగాట్‌ సహా పలువురు రెజ్లర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మహిళా రెజ్లర్లు క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గురువారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైనచర్చలు రెండుగంటలకు ముగిశాయి. అయితే ఈ చర్చలు విఫలమైనట్లు సమాచారం. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నుండి స్పందన కోరామని, అప్పటి వరకు వేచి ఉండాలని నిరసనకారులను మంత్రి కోరినట్లు సమాచారం. శుక్రవారం మధ్యాహ్నం రెజ్లర్ల ఫెడరేషన్‌ తన నివేదికను సమర్పించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రెజ్లర్ల ఫిర్యాదులను తిరస్కరించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్‌, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ పేర్కొన్నారు. బ్రిజ్‌ భూషణ్‌ను ఆ పదవినుంచి తప్పిస్తే సరిపోదని, ఫెడరేషన్‌ను రద్దు చేయాలంటూ రెజ్లర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)