పగిలిన పాదాలకు ఇంటి వైద్యం !

Telugu Lo Computer
0


చలికాలంలో మడమల పగుళ్లు, జుట్టు, చర్మం సమస్యు రావడం సర్వసాధారణం. వీటిల్లో పగిలిన మడమలు చాలా బాధాకరంగా ఉంటాయి. ఇక వాటి గురించి సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్య తీవ్రతరం అవుతుంది. ఇంట్లోనే ఉండి చలికాలంలో మనల్ని బాధించే మడమల పగుళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. పగిలిన మడమలను నయం చేయడం కోసం తేనెను స్క్రబ్, ఫుట్ మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఫలితంగా ఇది పాదాలకు వచ్చే ఇన్ఫెక్షన్‌ను కూడా దూరం చేస్తుంది. అంతేకాక పాదాలను తేమగా కూడా ఉంచుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అంతేకాక కొబ్బరి నూనె మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది. ఇది ఇన్ఫెక్షన్‌లను కూడా దూరంగా ఉంచుతుంది. పగిలిన మడమల కోసం అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు. అందుకోసం పాదాలను సరిగ్గా శుభ్రం కడిగి, తర్వాత అలోవెరా జెల్‌ను పాదాలకు అప్లై చేయాలి. అపై కాసేపు మసాజ్ చేయాలి. రాత్రంతా ఇలాగే వదిలేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీరు తక్షణ ఫలితాలను పొందగలరు. పగిలిన మడమలను వదిలించుకోవడానికి గ్లిజరిన్ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం ఒక గిన్నెలో నిమ్మరసం తీసుకుని, దానిలో ఒక టీస్పూన్ గ్లిజరిన్, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ కలపండి. వీటన్నింటిని మిక్స్ చేసి మడమల మీద అప్లై చేయండి. రాత్రంతా అలాగే వదిలేసి ఉదయం పాదాలను కడగాలి. ఈ ఫుట్ మాస్క్ మీ పాదాలను మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది. బియ్యపు పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, దానికి కొంచెం తేనె కలపండి. ఈ రెండింటిని బాగా కలిపి స్క్రబ్ చేయండి. తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే ఫలితాలు ఉంటాయి. ఒక గిన్నెలో సగం అరటి పండును మెత్తగా చేసుకుని దానిని పగిలిన మడమల మీద కాసేపు అలాగే ఉంచండి. దీని తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు దూరమవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)