మా పార్టీలో చేరితే పవన్ ను సీఎంని చేసే బాధ్యత నాది !

Telugu Lo Computer
0



ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. వివిధ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో మధ్య మధ్యలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేస్తున్న పంచ్ లు ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయనే టాక్ ఉంది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై పంచ్ లు వేశారు. ఏపీ రాజకీయాలపై స్పందించిన ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష్యంగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ ను రాజకీయ నేత అనడం సరైంది కాదు అన్నారు. ఎందుకంటే పవన్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని, ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడని అన్నారు. పవన్ ఎందుకు ఓట్లు చీల్చుతున్నాడో చెప్పాలని నిలదీశారు. ఆయన ముందు రెండు ఆఫ్షన్లు పెట్టారు. ప్రస్తుతం నిలకడ లేకుండా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని కేఏ పాల్ సలహా ఇచ్చారు. అలా కాకుండా రాజకీయాల్లో కొనసాగాలి అని ఆయన భావిస్తే వెంటనే మరో  ఆలోచన లేకుండా ప్రజా శాంతి పార్టీలో చేరాలని.. ఆయన్ను సీఎం చేసే బాధ్యత తనది అన్నారు. అలాగే ఏపీ సర్కారు తీసుకువచ్చిన జీవో నెం.1ని స్వాగతిస్తున్నట్టు పాల్ వెల్లడించారు. అయితే జీవో ప్రకారం వైసీపీ నేతలు ఇరుకు సందుల్లో సభలు, సమావేశాలు పెట్టినా తాను అడ్డుకుంటానని స్పష్టం చేశారు. అందుకే దాన్ని అది ప్రాణాలు కాపాడే జీవో అని పేర్కొన్నారు. అయితే ఇది మూడేళ్ల కిందటే రావాల్సిన జీవో అని, ఇప్పటికి వచ్చిందని అన్నారు. దీన్ని న్యాయస్థానం సస్పెండ్ చేయడం పట్ల కేఏ పాల్ విచారం వ్యక్తం చేశారు. సస్పెండ్ చేసింది న్యాయమూర్తే అయినా తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. మరొకరిని గెలిపించడం కోసం.. పని చేసే పవన్ కళ్యాణ్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా అనంతపురంలో మాట్లాడిన కేఏ పాల్.. చంద్రబాబు , జగన్‌లు కలిసి ఏపీ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపణలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ పెయిడ్ కార్యక్రమాలు చేస్తుంటారని వ్యాఖ్యానించారు. జేడీఏ లక్ష్మీనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు జనసేనలోకి వెళ్లరని అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ఓట్లు చీలుస్తున్నారని ప్రశ్నించారు. అప్పులు తీర్చి, లక్ష ఉద్యోగాలు తెస్తానని హామీ ఇచ్చారు. అంతవరకు నా పాస్ పోర్టు, గ్రీన్ కార్డ్ కోర్టుకు సబ్మిట్ చేస్తానన్నారు. సంక్రాంతి రోజు తాను చాలా బాధతో తాను మాట్లాడుతున్నానని.. ఎంతోమంది కనీసం 100 కూడా లేక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెయ్యి రూపాయలు లేక సొంత ఊళ్లకు వెళ్లలేకపోతున్నారని వాపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)