నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో 256 టైటానోసార్‌ గుడ్లు !

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని నర్మదా నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న బాగ్‌, కుక్షి ప్రదేశాల్లో జరిపిన తవ్వకాల్లో పొడవాటి మెడతో ఉండే శాకాహారులైన టైటానోసార్‌లకు చెందిన 256 గుడ్లు, పలు గూళ్లు బయటపడ్డాయి. అసాధారణ రీతిలో ఇక్కడ వీటి నివాసాలు బాగా దగ్గర దగ్గరగా ఉన్నాయని  పీఎల్‌ఓఎస్‌ ఒన్‌ జర్నల్‌లో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద తిరుగాడిన డైనోసార్‌ల గుడ్లను, గూళ్లను గుర్తించినట్లు ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు వెల్లడించారు.  ఇక్కడ లభించిన గుడ్లన్నీ బహుళ పెంకులతో నిర్మితమై ఉండడాన్ని వారు గమనించారు. పొదగడానికి అనువైన పరిస్థితులు లేనపుడు తల్లి తన గుడ్లను అండవాహికలోనే ఉంచుకోవడంతో పెంకుమీద పెంకు ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)