145 మంది జల సమాధి !

Telugu Lo Computer
0


వాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో(డీఆర్‌సీ) ఘోర ప్రమాదం జరిగింది. లులోంగా నదిలో 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న మోటారు బోటు ఓవర్ లోడుతో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 145 మంది చనిపోయి ఉంటారని అధికారులు తెలిపారు. మిగతా 55 మంది సురక్షితంగా ప్రాణాలతో బయపడినట్లు వెల్లడించారు. వీరంతా తమ వస్తువులు, పశువులతో రిపబ్లిక్ ఆఫ్ కాంగో వెళ్తుండగా బసన్‌కుసు పట్టణం సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు వస్తువులు, పశువులు ఉండటంతో బరువు ఎక్కువై పడవ నదిలో మునిగిపోయింది. డీఆర్‌సీలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. వలసదారులు బతుకుదెరవు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఈత రాకపోయినా పడవల్లో ప్రయాణించి ప్రమాదాలకు గురవుతుంటారు. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లు కూడా చాలా ఆలస్యమవుతుంటాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)