బాలుడిని మింగబోయిన నీటి గుర్రం !

Telugu Lo Computer
0


ఉగాండాలోలోని కట్వే కబటోరోలో సరస్సు ఒడ్డున బాలుడి ఇల్లు ఉంది. ఈ క్రమంలో చిన్నారి బయట ఆడుకుంటుండగా, ఉన్నట్లుండి నీటి గుర్రం బయటకు వచ్చింది. వెంటనే రెండేళ్ల బాలుడిని మింగే ప్రయత్నం చేసింది. నీటి గుర్రం బాలుడిని మింగేయడాన్ని స్థానికుడు ఒకరు గమనించాడు. వెంటనే అప్రమత్తమయ్యి నీటి గుర్రం మీదకు రాళ్లు విసరడంతో.. అది బాలుడుని బయటకు వదిలేసింది. అక్కడకు చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దుకు సమీపంలో ఉన్న బ్వేరా పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రమాదం జరగలేదని గుర్తించారు. ముందు జాగ్రత్తగా చిన్నారిక రేబిస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నివేదికల ప్రకారం.. ప్రతి ఏటా ఆఫ్రికాలో నీటి గుర్రాల బారిన పడి.. సుమారు 500 మంది మృతి చెందుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)