పైలట్‌ రోహిత్‌ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్‌కు ఈడీ నోటీసులు !

Telugu Lo Computer
0


తెలంగాణ ఎంఎల్ఏ పైలట్‌ రోహిత్‌రెడ్డి, హీరోయిన్‌ రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో వీళ్లిద్దరికీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి స్పందించారు. ఈడీ నోటీసులు అందాయని తెలిపారు. తన వ్యాపారాలు, కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగారని చెప్పారు. 19న ఈడీ విచారణకు హాజరవుతానని చెప్పారు. 2021 ఫిబ్రవరిలో కర్ణాటక రాజధాని బెంగళూరులో పట్టుబడిన డ్రగ్స్‌తో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. భారీగా నగదు చేతులు మారిన నేపథ్యంలో కేసును ఈడీకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే రోహిత్ రెడ్డికి నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)