ఐఆర్‌సీటీసీ సింగపూర్‌, మలేషియా ట్రిప్‌ !

Telugu Lo Computer
0


ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం  సీజన్‌కు తగ్గట్టు సరికొత్త టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ముగిసిన కార్తీక మాంసం సందర్భంగా దేశంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించేలా ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీలను ప్రకటించిన ఐఆర్‌సీటీసీ, తాజాగా ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీని లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా సింగపూర్, మలేషియా వంటి ఆగ్నేయాసియా దేశాలను తక్కువ ఖర్చుతో చుట్టేసి రావచ్చు. ప్రపంచ టూర్టిస్ట్ స్పాట్‌గా ప్రస్తుతం సింగపూర్ విరాజిల్లుతోంది. విశాలమైన జూలాజికల్ గార్డెన్స్, ఉద్యానవనాలకు నిలయంగా ఉంది. తక్కువ ధరతో సింగపూర్‌ టూర్ ప్యాకేజీని ఐఆర్‌సీటీసీ ప్రారంభించింది. టూరిస్ట్‌లు సింగపూర్‌తో పాటు మలేషియాకు కూడా వెళ్లేలా టూర్ ప్లాన్ చేసింది. ఈ టూర్ ప్యాకేజీలో కేవలం 32 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ టూర్ రెండు విడతలుగా ఉంటుంది. మొదటి టూర్‌ను మిస్ అయిన వారు రెండో టూర్‌కు వెళ్లడానికి ఐఆర్‌సీటీసీ అవకాశం కల్పించింది. మొదటి పర్యటన జనవరి 18న ప్రారంభం అవుతుంది. రెండో పర్యటన జనవరి 24న ఉంటుంది. ఈ టూర్ ఢిల్లీ ఎయిర్ ఫోర్ట్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి టూరిస్ట్‌లు సింగపూర్‌లోని మలిండో ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,35,000 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్/ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.1,15,500 చెల్లించాలి. చైల్డ్ విత్ బెడ్ (5-11 సంవత్సరాలు)కు రూ.1,03,000, చైల్డ్ వితౌట్‌ బెడ్ (5-11 సంవత్సరాలు) రూ.92,200 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆరు రోజుల టూర్‌ ఫీజు మొత్తంలో వీసా ఫీజు, విమాన ఛార్జీలు, లొకేషన్‌లో రోడ్డు ప్రయాణ అవసరాలు, 3-స్టార్ హోటల్‌లో రాత్రి వసతి, బ్రేక్‌పాస్ట్, లంచ్, డిన్నర్, ఆయా టూరిస్ట్‌ ప్లేసెస్‌లో ఎంట్రెన్స్ ఛార్జీలు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇంగ్లిష్ స్పీకింగ్ టూర్ గైడ్, టాక్స్‌లు కలిసి ఉంటాయి. టూర్ ప్యాకేజీలో భాగంగా సింగపూర్‌లోని పుత్రజయ టూర్, కింగ్స్ ప్యాలెస్, జామెక్స్ మసీదు, చాక్లెట్ ఫ్యాక్టరీ, పెట్రోనాస్ ట్విన్ టవర్, కె.ఎల్ టవర్ , పార్లమెంట్ హౌస్, సుప్రీం కోర్ట్, సిటీ హాల్ వంటి ప్రదేశాలను టూరిస్ట్‌లు విజిట్ చేయనున్నారు. సింగపూర్ టూర్ కోసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న ఒరిజినల్ పాస్‌పోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. వీసా ఫామ్ 14Aను ఫిలప్ చేసి, సంతకం చేసి ఇవ్వాలి. 35x 45mm సైజ్ రెండు ఫోటోలు, గత మూడు నెలల శాలరీ స్లిప్, గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, పాస్‌పోర్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కాపీ, విసా కాపీ సిద్దం ఉంచుకోవాలి. మలేషియా టూర్ కోసం ఆరునెలల వ్యాలిడిటీ ఉన్న ఒరిజినల్ పాస్ట్ పోర్ట్, సంతకంతో చేసిన గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, కనీసం 50000/- స్టాంప్, సెల్ఫ్ ఎంప్లాయి అయితే ప్లేన్ పేపర్/లెటర్‌హెడ్‌పై కవరింగ్ లెటర్, గత మూడు నెలల శాలరీ స్లిప్, యజమాని నుంచి NOC సర్టిఫికెట్, ఐడీ కార్డ్ రెడీగా ఉంచుకోవాలి. మరిన్ని వివరాల కోసం https://www.irctctourism.com/ లో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ సూచించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)