తగ్గిన బంగారం, వెండి ధరలు !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ పరిణామాలు ప్రతికూలంగా ఉండడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.473 తగ్గి రూ.53,898కి చేరింది. నిన్న 10 గ్రాముల బంగారం ధర రూ.54,371గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1,241 తగ్గి, రూ.65,878గా కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్సు బంగారం ధర రూ.1,46,146గా ఉంది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ సుదీర్ఘకాలం పాటు తగ్గించే అవకాశం లేకపోవడంతో పసిడి ధర తగ్గుతుందని నిపుణులు చెప్పారు. ఔన్సు వెండి ధర రూ.1,847గా ఉంది. డాలర్ తో రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతుంది. ఈరోజు  అమెరికా డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ 81.91గా ఉంది. మార్కెట్ క్లోజింగ్ సమయానికి 82.60కి పడిపోయింది. నిన్నటితో పోల్చితే 80 పైసలు పడిపోయింది. వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ అధికంగా కొనసాగిస్తుండడంతో దాని ప్రభావంతో మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)