తమిళనాడులో భారీవర్షాలు

Telugu Lo Computer
0


తమిళనాడులో తుపాన్ ప్రభావం వల్ల మంగళవారం భారీవర్షాలు కురుస్తుండటంతో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఆరు బృందాలను మోహరించారు. నాగపట్టణం, తంజావూర్, తిరువరూర్, కడలూర్, మైలాదుత్తురాయ్, చెన్నై ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ వల్ల భారీవర్షాలు కురుస్తుండటంతో ముందు జాగ్రత్తగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో సహాయ పునరావాస పనులు చేపట్టారు. అరకోణంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి తుపాన్ తీవ్రతను సమీక్షిస్తున్నారు. తుపాన్ వల్ల భారీవర్షాలు కురుస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.ఈ తుపాన్ ప్రభావం వల్ల తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో మరో మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)