మహిళ ఆటో డ్రైవర్‌కు ఆటో బహుకరించిన ఐశ్వర్య రాజేష్‌

Telugu Lo Computer
0


ఐశ్వర్య రాజేష్‌ గ్లామర్‌ పాత్రలకు అతీతంగా, కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషిస్తూ తమిళనాట విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకుంది. సినిమాల్లోకి రావాలంటే రంగు ఏమాత్రం అడ్డు కాదని, నటించడం వస్తే చాలని నిరూపించింది. ప్రస్తుతం ఈమె చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. అందులో డ్రైవర్‌ జమున ఒకటి. పా.కిన్ల్సిన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం రిలీజై మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. క్యాబ్‌ డ్రైవర్‌గా ఐశ్వర్య నటనకు మంచి మార్కులే పడ్డ.. కథనం పరంగా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్‌లను మేకర్స్‌ పెద్ద ఎత్తున జరిపారు. కాగా ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్‌ తాజాగా చిత్రయూనిట్‌ మహిళా ఆటో డ్రైవర్‌లను కలిశారు. చెన్నై సహా ఇతర జిల్లాలకు చెందిన 40మంది ఆటోడ్రైవర్‌లను ప్రమోషన్‌లో భాగంగా పిలిచారు. ఈ నలభై మందిలో ఒకరిని ఎంపిక చేసి ఆమెకు ఆటోను బహుమతిగా ఇచ్చారు. ఆటో తాళం చెవిని ఐశ్వర్య ఆ మహిళకు అందజేసింది. దాంతో డ్రైవర్‌ జమున టీమ్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. 18 రీల్స్‌ బ్యానర్‌పై ఎస్‌.పి.చౌదరి ఈ సినిమాను నిర్మించాడు. కాగా ముందుగా ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్‌ చేయాలని సన్నాహాలు చేశారు. కానీ చివరి నిమిషంలో ఒక్క తమిళంలోనే రిలీజ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)