రన్నింగ్ బండిపై రొమాన్స్ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 31 December 2022

రన్నింగ్ బండిపై రొమాన్స్ !


ఆంధ్రప్రదేశ్ లోని వైజాగ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ రోడ్డులో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అసభ్యకర రీతిలో డ్రైవ్ లో సాగిన చోడవరం ప్రాంతానికి చెందిన అజయ్ (22), యువతి (19) లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలు బయటకు వచ్చాక కూడా వారి కదలికలపై దృష్టి పెట్టాలని సూచించారు. గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్‌లో అజయ్ జంట నడిరోడ్డుపైనే బరితెగించారు. పట్టపగలు.. పబ్లిక్‌లో బైకుపై హెల్మెట్ కూడా లేకుండా ఒకరికెదురు మరొకరు కూర్చొని రెచ్చిపోయారు. అక్కడితో ఆగలేదు.. అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఇంకా చెప్పలేని పనులు చేసింది. వారి వెనుక ఓ ఫామిలీ కారులో వెళ్తూ.. ఇదేం పని.. మీకు బుద్ది ఉందా అని అడిగినా.. ఏమాత్రం వినిపించుకోకుండా.. వారి పని వారు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఇద్దరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే.. వారి గుండె ఆగి పోతుందని.. ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని కామెంట్స్ చేశారు. 

No comments:

Post a Comment