శీతాకాలం సెలవులు ప్రకటించిన సుప్రీంకోర్టు

Telugu Lo Computer
0


డిసెంబర్‌ 17 వ తేదీ నుండి జనవరి 1 వరకు సుప్రీంకోర్టుకి శీతాకాలం సెలవులను సిజెఐ డి.వై. చంద్రచూడ్‌ ప్రకటించారు.  ఏ సుప్రీంకోర్టు ధర్మాసనం అందుబాటులో ఉండదని తెలిపారు. అయితే సెలవుల సమయంలో ప్రత్యేకంగా వెకేషన్‌ బెంచ్‌లను ఏర్పాటు చేసేవారు. ఈ సారి జనవరి 1 వరకు ఏ బెంచ్‌లు ఉండబోవని సిజెఐ చంద్రచూడ్‌ వెల్లడించారు. జనవరి 2న సుప్రీంకోర్టులో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానుందని అన్నారు. న్యాయం కావాలనుకునేవారికి సుదీర్ఘ కోర్టు సెలవులు అంత అనుకూలం కాదనే భావన ప్రజల్లో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం రాజ్యసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మరుసటి రోజే సిజెఐ సెలవులను ప్రకటించడం గమనార్హం. గతంలో కూడా కోర్టు సెలవులపై వివాదం నెలకొంది. న్యాయమూర్తులు సౌకర్యవంతంగా సెలవులను ఆస్వాదిస్తారనే దురభిప్రాయం ఉందని మాజీ సిజెఐ ఎన్‌.వి.రమణ సహా పలువురు జడ్జీలు పేర్కొన్నారు. జడ్జీలు తాము ఇచ్చిన తీర్పుల గురించి పునరాలోచిస్తూ నిద్రలేని రాత్రులను గడుపుతారని జులైలో రాంచిలో జస్టిస్‌ ఎస్‌.బి. సిన్హా స్మారక ఉపన్యాసంలో మాజీ సిజెఐ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)