డ్యాన్స్ చేసిన మహిళా కానిస్టేబుళ్లు సస్పెండ్ !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో డ్యాన్స్ చేసిన నలుగురు మహిళా కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయోధ్యలోని రామజన్మభూమి సైట్ లో భద్రతా విభాగంలో పనిచేసే నలుగురు మహిళా పోలీస్ కానిస్టేబుళ్లు భోజ్ పురి పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ పంకజ్ పాండే దాఖలు చేసిన విచారణ నివేదిక ఆధారంగా మహిళా కానిస్టేబుళ్లు కవితా పటేల్, కామినీ కుష్వాహ, కాశిష్ సాహ్ని ,సంధ్యా సింగ్‌లను సస్పెండ్ చేస్తూ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మునిరాజ్ ఆదేశాలు జారి చేశారు. అయితే మహిళా కానిస్టేబుళ్లు డ్యాన్స్ చేస్తున్న సమయంలో యూనిఫామ్ లో లేరని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)