డాక్టర్‌ సర్పంచ్‌ యశోధరా షిండే

Telugu Lo Computer
0

Maharashtra Gram Panchayat Result: Georgia Return MBBS Student Elected As  Sarpanch In Sangli District

మహారాష్ట్ర, సంగ్లీ జిల్లాలోని మిరాజ్‌ తహసీల్‌ వడ్డి గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికలలో యశోధరా షిండే అనే డాక్టర్‌ విద్యార్థి  పోటీ చేసి గెలిచింది. ఎందుకు పోటీ చేయవలసి వచ్చిందో ఆమె మాట్లాడుతూ  'జార్జియాలోని న్యూ విజన్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాను. ఇప్పుడు నేను నాలుగో సంవత్సరంలో ఉన్నా. ఇంకా ఏడాదిన్నర కోర్సు మిగిలి ఉంది. మా గ్రామంలో ఎన్నికలు ప్రకటించిన క్రమంలో మా ఇంటి నుంచి ఎవరైనా పోటీ చేయాలని స్థానికులు కోరారు. సర్పంచ్‌గా నన్ను బరిలో నిలపాలని మా కుటుంబంతో పాటు అంతా నిర్ణయించారు. ఆ తర్వాత నాకు ఫోన్‌ చేసి చెప్పడంతో వచ్చాను. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాను.' అని అన్నారు. తమ గ్రామం వడ్డి అభివృద్ధి కోసం పాటుపడతానని, మహిళలు స్వయంసమృద్ధిగా ఎదిగేందుకు, విద్యార్థుల కోసం ఈ లర్నింగ్‌, ఇతర మెరుగైన విద్యావిధాలను తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొంది యశోధరా. రైతుల సంక్షేమంతో పాటు యువతకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూస్తానని ధీమా వ్యక్తం చేశారు. మహిళలకు సమానమైన అవకాశాలు రావాలని, అందుకు తగినట్లుగా వారు చదువుకుని స్వతంత్రంగా జీవించేందుకు కృషి చేస్తానని నొక్కి చెప్పారు యశోధరా. మరోవైపు.. తన ఎంబీబీఎస్‌ చదువును కొనసాగిస్తానని, ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి చేస్తానని వెల్లడించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)