ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో భారత దేశం !

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలో జరిగిన 95వ ఎఫ్ఐసీసీఐ వార్షిక సదస్సులో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దేశానికి ఐదు వాగ్దానాలు చేశారని గుర్తుచేశారు. ఈ ఐదు వాగ్దానాలూ దేశాన్ని సూపర్‌పవర్‌గా తీర్చిద్దేందుకు అనివార్యమని అన్నారు. ఇండియా సూపర్‌పవర్‌ కావడం అంటే ఏ ఒక్క దేశంపైనో ఆధిపత్యం కోసం కాదని, ఇతర దేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమించుకునే ఉద్దేశం మనకు లేదని చెప్పారు. భారత రక్షణ బలగాల ధైర్యసాహసాలు ప్రశంసంస్తూ..''గల్వాన్ కావచ్చు, తవాంగ్ కావచ్చు, మన రక్షణ బలగాలు అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించాయి'' అని అన్నారు. భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే చైనా జీడీపీ 1949లో చాలా తక్కువగా ఉండేదని, 1980 వరకూ భారతదేశం కనీసం టాప్-10 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కూడా లేదని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. 2014లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 5వ స్థానంలో ఉందన్నారు. ఈరోజు 3.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే ఐదవ స్థానానికి చేరుకుందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)