చలికాలం - జాగ్రత్తలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 16 December 2022

చలికాలం - జాగ్రత్తలు !


శీతాకాలంలో చల్లని గాలి చర్మంపై ఉన్న తేమను మాయం చేస్తుంది. స్కిన్‌ డ్రైగా మారుతుంది. చర్మం మీద పగుళ్లు రావడంతో దురదగా, చికాకుగా అనిపిస్తుంది. ఎన్ని క్రీమ్ లూ, జెల్లీలు రాసినా ఒక్కోసారి ఫలితం కనిపించదు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొంత పర్వాలేదు కానీ డ్రై స్కిన్ వాళ్ళు మాత్రం చాలా తంటాలు పడుతుంటారు. మాయిశ్చరైజర్‌ వినియోగించడం వల్ల తేమను పట్టి ఉంచుతుంది. ఎక్కువ సేపు చర్మం తాజాగా ఉంటుంది. జనపనార గింజల నూనెను కూడా మాయిశ్చరైజర్‌గా వినియోగించవచ్చు. అన్ని రకాల చర్మాలకు ఇది ఉపయోగపడుతుంది. సన్ స్క్రీన్ లోషన్ కేవలం వేసవి కాంలో రాసుకోవాలనే అపోహలో ఉంటారు. కానీ చలికాలంలో ఎండ తీవ్రత కాస్త తక్కువగానే ఉన్నా ఎప్పుడూ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి. వర్షాలు పడుతున్నప్పుడు, ఫుల్ గా మేఘాలు ఉండి సూర్యుడు కనిపించనప్పుడు కూడా సూర్యుని ప్రమాదకరమైన UV కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. రెడ్ రాస్‌ప్‌బెర్రీ క్రీమ్ వంటి సహజ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం ద్వారా చర్మాన్ని కాపాడుకోవచ్చు. ఇది తగినంత SPF ప్రొటెక్షన్‌ అందిస్తుంది, మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది. చలికాలంలో దాదాపు అందరూ వేడినీటితో స్నానం చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. కాని దీనివల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. న్యాచురల్‌ లిపిడ్‌ బ్యారియర్‌ను నాశనం చేసి చర్మాన్ని మరింత పొడిగా చేస్తుంది. కానీ చన్నీళ్ళతో స్నానం చేయలేము కాబట్టి స్నానానికి ముందు బాడీ ఆయిల్ అప్లై చేయడం వల్ల చర్మం తేమను కాపాడుకోవచ్చు. అలాగే మరీ ఉడుకు నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్ళను ఉపయోగించాలి. ఏ సీజన్‌లో అయినా హైడ్రేటెడ్‌గా ఉంటే చర్మానికి సంరక్షణ ఉంటుంది. ఆల్కహాల్, కాఫీ, టీ లేదా చక్కెర పానీయాలు తాగడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాల సరఫరా తగ్గిపోతుంది. కాబట్టి వాటిని వీలయినంత వరకూ తగ్గించేయాలి. ఆరోగ్యకరమైన చర్మం కోసం నీటిని ఎక్కువగా తాగాలి. నీరు తరచూ తాగడం వల్ల చర్మం లోపల రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి వ్యాయామం చాలా అవసరం. వ్యాయామంతో చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. ఇది బ్లడ్‌ ఆక్సిజనేషన్‌ను పెంచుతుంది, తగినంత ఆక్సిజన్‌తో రక్తం చర్మ కణాలను కీలక పోషకాలతో నింపుతుంది. దీంతో చర్మం ఆరోగ్యం మెరుగవుతుంది. యోగా, రన్నింగ్ లేదా ఏదైనా ఇతర స్పోర్ట్స్‌ ఆడటం ద్వారా శీతాకాలంలో చర్మాన్ని కాపాడుకోవచ్చు.ఇవన్నీ తీసుకుంటూనే ఇంట్లో వాడే వాటితో, వంటింట్లో దొరికే వాటితో కూడా మన చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవచ్చును. బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. పొడి బారిన చర్మాన్ని బొప్పాయి మాశ్చరైజ్ చేస్తుంది. అంతేకాదు చర్మం మెరిసేటట్టు కూడా చేస్తుంది. అలాగే నిమ్మకాయలో బోలెడు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తేనె ఒక అద్బుతమైన హైడ్రేటింగ్ పదార్ధం. కాబట్టి నిమ్మకాయ, తేనె కలిపి చర్మానికి అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఇక పసుపు, దీని గురించి తెలియనది ఎవరికి. చలికాంలో పసుపు రాసుకుంటే కూడా చాలా మంచిది.శనగపిండి, ముల్తానా మట్టి లాంటివి కూడా అప్పుడప్పుడూ రాసుకుంటే ఉంటే చర్మం అందంగా ఉండడమే కాకుండా మృదువుగా ఉండి మెరుస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment