ముంబై ఆర్టీసీ బస్సులో ఉమ్మేస్తే రూ. 200 జరిమానా !

Telugu Lo Computer
0


ముంబై ఆర్టీసీ పాన్, గుట్కా, తంబాకు, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులను నమిలి బస్సులో ఉమ్మేసే ప్రయాణీకులకు రూ. 200 జరిమానా విధించాలని నిర్ణయించింది. జరిమానా వసూలు చేసే బాధ్యతను ఆ బస్సులోని కండక్టర్, డ్రైవర్ లకు కట్టబెట్టింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే సమీప పోలీస్ స్టేషనులో అప్పగించే అధికారం కల్పించింది. దీని వల్ల ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారికి మేలు కలుగుతుందని సంస్థ భావిస్తోంది. నాన్ ఏసీ బస్సుల్లోనైతే కిటికీల గుండా బయటికి ఉమ్మేయవచ్చు. కానీ, ఏసీ బస్సుల్లో ఆ సదుపాయం లేకపోవడంతో చాలా మంది సీటు కింద, రెండు సీట్ల మధ్య ఉమ్మేస్తున్నారు. దీంతో ఆ పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తుండగా, అలాంటి చోట కూర్చోడానికి ప్రయాణీకులు నిరాకరిస్తున్నారు. అంతేకాక, పారిశుద్ధ్య సిబ్బందికి కూడా ఆ మరకలను క్లీన్ చేయాలంటే అదనంగా కష్టపడాల్సి వస్తోంది. దీంతో జరిమానా నిబంధన అమల్లోకి తేగా, రెడ్ హ్యాండెడ్ గా దొరికితే రూ. 200 వసూలు చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రయాణీకులకు తెలియజేయడానికి అన్ని బస్సుల్లో అనౌన్స్ మెంట్ సిస్టంను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనివల్ల కొంతమంది అయినా మారతారని, బస్సులు నీట్ గా ఉంటాయని అధికారులు ఆశిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)