కొబ్బరి నూనె - ఉపయోగాలు !

Telugu Lo Computer
0


దేశం చాలా ఇళ్లలో ఆవాల నూనె, వేరు శనగ నూనె, కుసుమ నూనె వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొబ్బరి నూనె కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరినూనెలో ఉడికించి ఆహార పదార్ధలను తింటే రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. 2009లో చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. కొబ్బరినూనెలో ఉండే మంచి కొవ్వు శరీరంలో ఇన్సులిన్ పెరగకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలో షుగర్‌ అదుపులో ఉంటుంది. కొబ్బరి నూనె వంటలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో కొబ్బరి నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడించారు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ తగ్గి, చెడు కొలెస్ట్రాల్ పెరిగితే.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. పామ్ మెడ్‌సెంట్రల్ పరిశోధనల ప్రకారం.. కొబ్బరి నూనె మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుందని వెల్లడించింది. కొబ్బరి నూనెను 8 వారాల పాటు ఆహారంలో తీసుకుంటే కలిగే ప్రయోజనాలు స్వయంగా అనుభూతి చెందుతారని పరిశోధకులు తెలిపారు. జంక్ ఫుడ్‌ వంటి ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల కాలేయంపై చెడు ప్రభావం పడుతుంది. విలే ఆన్‌లైన్ లైబ్రరీ ఎలుకలపై చేసిన పరిశోధనలో కొబ్బరి నూనె కాలేయ సమస్యలను ఎదర్కొవడంలో ప్రభావవంతంగా పనిచేస్తుందని తెల్పింది. బరువు తగ్గడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)