ఐమ్యాక్స్ లో అతి పెద్ద తెర

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో ఐమ్యాక్స్ లో ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఉంది. సిటీలోనే పెద్ద స్క్రీన్ గా దానికి పేరుంది. మరికొన్ని రోజుల్లో ఐమాక్స్ లో దేశంలోనే అతి పెద్ద తెరపై సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది. ఐమాక్స్ లో అతి పెద్ద తెరను యాజమాన్యం సిద్ధం చేసింది. ఈ స్క్రీన్ 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఉంది. దాంతో, ఇది భారత దేశంలో అతి పెద్ద సినిమా తెరగా రికార్డుకెక్కింది. కెనడాకు చెందిన 'స్ట్రాంగ్ ఎండీఐ' అనే ప్రొజెక్షన్ స్ర్కీన్ల తయారీ సంస్థ ప్రత్యేకంగా ఈ తెరను రూపొందించింది. సౌండ్ సిస్టమ్ ను కూడా అత్యుత్తమమైనది ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల నాటికి ఈ తెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)