పొరపాటున కిడ్నీ తొలగించిన వైద్యులు !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని కసగంజ్ జిల్లాలో డీఎస్ నివాసంలో సురేష్ చంద్ర అనే వ్యక్తి హోమ్ గార్డ్‎ గా పని చేస్తున్నాడు. అతనికి గత కొన్ని రోజులుగా నడుం నొప్పితో బాధ పడుతున్నాడు. ఏప్రిల్ లో అలీఘర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీ లో రాళ్లు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ చేయాలని సూచించడంతో చేయించుకున్నాడు. కొన్ని రోజులు మామూలుగానే ఉన్నప్పటికీ ఎనిమిది నెలల తర్వాత మళ్లీ నొప్పి రావడం తో హాస్పిటల్ కి వెళ్లగా స్కానింగ్ తీశారు. ఈసారి రాళ్లు కాదు, ఏకంగా కిడ్నీ నే లేదని రిపోర్ట్స్ వచ్చాయి. దాన్ని చూసిన హోంగార్డు సురేష్ చంద్ర స్పృహ కోల్పోయాడు. విషయం ఏంటని ఆరా తీయగా ఆపరేషన్ చేసే సమయం లో పొరపాటున కిడ్నీ తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన గురించి సురేష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. రాళ్లను తొలగించడానికి సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు కిడ్నీ తొలగించారు. ఈ విషయం తెలుసుకుని సురేష్ చంద్ర కలత చెందాడు. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఆస్పత్రి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కోరాడు. చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)