ఆంధ్రప్రదేశ్ పైన అల్పపీడన ప్రభావం !

Telugu Lo Computer
0


తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపైనే ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని వల్ల నవంబర్ 11 నుంచి 13 వరకు ఎపిలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావం తెలంగాణపై లేదని, రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 నుంచి 22 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, రెండు, మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణలో 11 నుంచి 15 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)