కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లిన లాలూ యాదవ్

Telugu Lo Computer
0


బీహార్ మాజీ ముఖ్యమంత్రి,ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకునేందుకు శనివారం కుమార్తె రోహిణితో ఇతర కుటుంబసభ్యులతో కలిసి సింగపూర్ వెళ్లారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూకు కిడ్నీని ఆయన కుమార్తె రోహిణి ఆచార్య దానం చేయనున్నారు.లాలూ వెంట సింగపూర్ దేశానికి ఆయన చిన్న కుమారుడు తేజస్వీయాదవ్ వెళ్లారు. సింగపూర్ లో వైద్యపరీక్షల తర్వాత లాలూ డిసెంబర్ మొదటివారంలో కిడ్నీమార్పిడి ఆపరేషన్ చేయించుకోనున్నారు. లాలూ ఆపరేషన్ విజయవంతం అయి ఆరోగ్యం మెరుగుపడుతుందని తమకు నమ్మకం ఉందని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ చెప్పారు. జైలు నుంచి బెయిలుపై బయటకు వచ్చిన లాలూ చికిత్స కోసం బయటకు వచ్చారు.లాలూ మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలతో సహా అనేక వ్యాధులతో బాధపడుతున్నాడు.లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతికి కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్ వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)