బేటీ బచావ్ బేటీ పడావ్ లో కొత్త అంశాల చేరిక!

Telugu Lo Computer
0

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బేటీ బచావ్ బేటీ పడావ్ పథకంలో కొన్ని మార్పులు చేపట్టింది. బాలికలకు నైపుణ్య శిక్షణ, సెకండరీ విద్యలో బాలికల నమోదును పెంచడం, బహిష్టు సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత గురించి అవగాహన పెంపొందించడం, బాల్య వివాహాల నిర్మూలనపై చట్టాల గురించి చైతన్యపరచడం వంటి అంశాలను కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ పథకంలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి ఇందీవర్ పాండే మంగళవారం నాడిక్కడ బాలికలకు సాంప్రదాయేతర జీవనభృతులలో నైపుణ్యం కల్పించడంపై జరిగిన ఒక జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ బాలికలు విభిన్న జీవన భృతులు పొందేందుకు అవకాశాలు కల్పించడంలో ఉన్నఅవరోధాలను తొలగించడంపై కూడా దృష్టి సారిస్తామని చెప్పారు. బేటీ పడావ్ బేటీ బచావ్ పథకాన్ని సవరించడం జరిగిందని, ఇప్పుడు దానికి సరికొత్త రూపం ఏర్పడిందని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)