షరతులతో కూడిన 'మూన్‌లైటింగ్'కు అనుమతి !

Telugu Lo Computer
0


ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 'మూన్‌లైటింగ్'కు అనుమతించింది. అయితే, అనేక షరతులు విధించింది.  ఒక కంపెనీలో పని చేస్తూ, అలాంటి మరో కంపెనీలో రెండో ఉద్యోగం (పార్ట్ టైమ్/ఫుల్ టైమ్) చేయడాన్నే 'మూన్‌లైటింగ్' అంటారనే సంగతి తెలిసిందే. ఇటీవల ఈ అంశంపై దృష్టి పెట్టిన కంపెనీలు దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాయి. అనేక కంపెనీలు 'మూన్‌లైటింగ్'కు పాల్పడుతున్న ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. తాజాగా దీనిపై ఇన్ఫోసిస్ కీలక సూచనలు చేసింది. తమ ఉద్యోగుల 'మూన్‌లైటింగ్'కు అనుమతించింది. మేనేజర్ల అనుమతితో 'మూన్‌లైటింగ్' చేసుకోవచ్చని తెలిపింది. కానీ, ఈ విషయంలో కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం.. 'మూన్‌లైటింగ్' చేయాలంటే ఇన్ఫోసిస్ కంపెనీకి పోటీగా ఉన్న సంస్థల్లో పని చేయరాదు. అలాగే తమ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలి. ఈ అంశంపై కంపెనీ తమ ఉద్యోగులకు అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని కంపెనీ గిగ్ వర్క్స్ లేదా మూన్‌లైటింగ్ అని మాత్రం చెప్పలేదు. ఈ నిర్ణయం వల్ల కంపెనీకి చెందిన ఉద్యోగులు రెండో ఉద్యోగం చేస్తూ మరికొంత ఆదాయం సంపాదించుకునే వీలుంటుంది. మరోవైపు కంపెనీ నుంచి వలసలు కూడా తగ్గుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)