తొలి తెలుగు పాన్‌ ఇండియా బాలల చిత్రం 'లిల్లీ'!

Telugu Lo Computer
0


గోపురం స్టూడియోస్‌ పతాకంపై కె. బాబురెడ్డి, జి. సతీష్‌కుమార్‌ నిర్మించిన బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ మూవీతో శివమ్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నేహ లీడ్‌రోల్‌లో వేదాంత్‌ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్‌వీర్‌ ముఖ్య పాత్రను పోషించారు. శనివారం హైదరాబాద్‌లో 'లిల్లీ' సినిమా ప్రమోషన్‌ను లాంఛనంగా ప్రారంభించింది చిత్రయూనిట్‌. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి. వి. వినాయక్ ‘లిల్లీ’ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో పాటు సినిమాలోని ఎమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”దర్శకుడు శివమ్ తెరకెక్కించిన ఈ మూవీ క్యాన్సర్ పై పోరాటం మీద వుంటుంది. క్యాన్సర్ ని ఓ డైనోసార్ తో పోలుస్తూ పోస్టర్ డిజైన్ చేసిన విధానం నచ్చింది. సీనియర్ నటుడు శివకృష్ణగారు సినిమాల మీద ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. నా ‘చెన్నకేశవ రెడ్డి’లో ఆయన నటించారు. ఇటీవల ఈ సినిమా రీ-రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి సినిమా రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మనవడు నటించిన ఈ సినిమా హిట్ అవ్వాలి” అని అన్నారు. దర్శకుడు శివమ్ మాట్లాడుతూ, ”మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'అంజలి' సినిమానే దీనికి ఇన్స్‌పిరేషన్‌. మణి సార్‌కి ఏకలవ్య శిష్యుణ్ని నేను. ఈ రోజుల్లో ఒక బాలల చిత్రాన్ని దేశవ్యాప్తంగా నిర్మాతలు విడుదల చేయాలని అనుకోవడం గ్రేట్” అని అన్నారు. నిర్మాత బాబురెడ్డి మాట్లాడుతూ, ”సినిమాలో ఎటువంటి వల్గారిటీ లేకుండా వుంటేనే నేను నిర్మిస్తానని దర్శకుడికి చెప్పాను. అలాంటి కథనే చెప్పి నన్ను ఒప్పించాడు. పిల్లల్ని దేవుళ్లంటారు కదా! ఈ సినిమా చూస్తే అలా ఎందుకంటారో అర్ధమవుతుంది. ప్రస్తుత సమాజంలో పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్లాలంటే పేరెంట్స్‌ భయపడుతున్నారు. కానీ, మా సినిమాకి పెద్దవాళ్లే సినిమా చూడమని పిల్లల్ని పంపుతారు” అని అన్నారు. నటుడు శివకృష్ణ మాట్లాడుతూ, ”ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడో ఓ సారి మాత్రమే తలుపు తట్టి మన దగ్గరికి వస్తాయి. ఈ చిత్రంలో నటించిన నేహ, దివ్యతో పాటు నా మనవడు వేదాంత్‌వర్మ కూడా ఎంతో చక్కగా నటించాడు. ఈ ముగ్గురూ ‘లిల్లీ’ వంటి మంచి చిత్రంతో నటులుగా పరిచయం అయినందుకు ఆనందంగా ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కీలకమైన రియల్‌లైఫ్‌ పాత్రలో నటించిన మలయాళ హీరో రాజీవ్‌పిళ్లై, బాలీవుడ్‌ నటి మిషెల్‌ షా కూడా పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)