ఆంధ్రప్రదేశ్ లో రెండ్రోజుల పాటు వర్షాలు

Telugu Lo Computer
0


నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతం , దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. మంగళవారానికి ఉత్తర అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి పశ్చిమ మధ్య మరియు ప్రక్కనే ఉన్న నైరుతి బంగాళాఖాతం ఖాతం ప్రాంతములో అక్టోబర్ 20 నాటికి అల్పపీడన ప్రాంతంగా విస్తరించనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా మరియు యానాం ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఇవాళ దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ లో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలాచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలుఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఇటు రాయలసీమలో ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)