సౌదీ అరేబియా ప్రధానిగా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్

Telugu Lo Computer
0


సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌ను ప్రధానిగా నియమిస్తూ సౌదీ అరేబియా రాజు సల్మాన్ అబ్దులాజిజ్ అల్ సౌద్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఎంబీఎస్‌గా పిలిచే మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ చరిత్రలో అత్యంత వివాదాస్పద యువరాజుల్లో ఒకడిగా ఉన్నాడు. 2018లో ఇస్తాంబుల్‌లోని సౌదీ వాణిజ్య రాయబార కార్యాలయంలో జరిగిన సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య కేసులో ఎంబీఎస్ ప్రమేయం ఉన్నట్లు ఇటీవల అమెరికా ఆరోపించింది. ఈ హత్యకు ఆయనే ఆదేశించినట్లు అమెరికా చెప్పింది. కానీ, ఈ ఆరోపణలను సౌదీ యువరాజు ఎంబీఎస్ కొట్టిపారేశారు. అయితే, అతడికి సౌదీ అరేబియాలో ప్రజల నుంచి మద్దతు ఉంది. చాలా మంది అతడిని సమర్ధుడైన యువరాజుగా అభివర్ణిస్తారు. చమురు సరఫరాలో సౌదీ అరేబియాను ముందంజలో నిలపడంలో, సామాజిక, ఆర్థిక, మతపరమైన సంస్కరణలు తీసుకురావడంలో ఎంబీఎస్ కీలకంగా వ్యవహరించాడని అక్కడి వాళ్ల అభిప్రాయం. సౌదీ అరేబియాకు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడలోనూ సఫలమయ్యాడు. 2017లో ఆయన సౌదీ యువరాజుగా ఎంపికయ్యారు. సౌదీని అన్ని దేశాలకు మిత్ర దేశంగా మారుస్తానని ఎంబీఎస్ గతంలో అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)